#Trump: అభిశంసనకు గురైన ట్రంప్..బైడన్ కు క్లియర్
అమెరికా చరిత్రలో చీకటి రోజు
Trump : అమెరికా చరిత్రలో చీకటి రోజు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వినుతి కెక్కిన యుఎస్ఏలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ఘోర అవమానం జరిగింది. ఆయన అభిశంసనకు గురయ్యాడు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ ముట్టడించేందుకు తన మద్ధతుదారులను ఎగదోశారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి మెజారిటీ సభ్యులు తమ ఆమోదాన్ని తెలుపడంతో ట్రంప్ అవమాన భారంతో వైట్ హౌస్ ను వీడాల్సి వచ్చింది. ఆయన తనంతకు తానుగా ఈ పరిస్థితిని తెచ్చుకున్నారు.
దీంతో అమెరికా దేశ చరిత్రలో రెండవ సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా నిలిచారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్నారు. ఇరాన్, చైనా దేశాలతో కయ్యానికి కాలు దువ్యారు. ఇండియాతో పెట్టుకున్నారు. ఆ తర్వాత చెలిమి చేశారు. పాకిస్తాన్ ను ఎగ దోశారు. ఉగ్రవాద జాడలు పాక్ లోనే ఉన్నాయని గ్రహించి వెనక్కి తగ్గారు. ఇరాన్ , అరబ్ దేశాలను టార్గెట్ చేశారు. ఏకంగా ఇరాన్ కోర్టు ట్రంప్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
మరో వైపు ఆ దేశంలోని ప్రతి ఒక్కరు ఒక డాలర్ చొప్పున పోగేసి అతడి తలను తీసుకు వచ్చిన వారికి ఇస్తామని సంచలన ప్రకటన చేసింది. హెచ్1బి వీసాల పొడిగింపుపై నిషేధం విధించారు. అమెరికన్లకు తప్ప వేరే వాళ్లకు ఉపాధి అవకాశాలు ఉండవన్నారు. వత్తిళ్లు పెరగడంతో మిన్నకుండి పోయారు. ప్రపంచాన్ని శాసిస్తున్న సామాజిక మాధ్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, తదితరవన్నీ ట్రంప్ ఖాతాలను నిషేధించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
ట్రంప్ దుందుడుకు ధోరణి, మితి మీరిన అహంకారం, తాను చెప్పిందే వేదం అన్న రీతిలో సాగిన ఆయన రానున్న రోజుల్లో విచారణ ఎదుర్కోనున్నారు. అధికారం ఉంది కదా అని మిడిసి పడితే ఇలాగే అవుతుందన్న వాస్తవాన్ని తెలంగాణలో ఒంటెద్దు పోకడలు పోతున్న కేసీఆర్ కు, కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వాలు గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
No comment allowed please