#BanWhatsApp : సిగ్న‌ల్ .. టెలిగ్రాంజోరు వాట్సాప్ బేజారు

వాట్సాప్ కు కోలుకోలేని షాక్

Ban WhatsApp  : ముందూ వెనుకా చూసు కోకుండా ఫేస్‌బుక్, వాట్సాప్ లు తీసుకున్ననిర్ణ‌యం వారి బిజినెస్ ను దెబ్బ తీసేలా చేసింది. ప్ర‌పంచాన్ని ఆర్థిక రంగం శాసిస్తే..ఆ రంగాన్ని వినియోగ‌దారులు, క‌స్ట‌మ‌ర్లు ప్ర‌భావితం చేస్తున్నారు. ఏ రంగమైనా..ఏ కంపెనీ అయినా వీరే కీల‌కం..ఆదాయానికి ఆధారం కూడా. వారి అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు న‌డుచుకోక పోతే తాము వేరే వాటిని అనుస‌రిస్తామ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. కోలుకోలేని షాక్ ఇచ్చారు. మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానాలు మార్చుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దాని పోటీ సంస్థ‌ల‌కు వ‌రంగా మారింది.

వాట్సాప్ త‌ల తిక్క నిబంధ‌న‌లు త‌ట్టుకోలేక యూజ‌ర్లు ఇత‌ర మెసేజింగ్ యాప్‌ల వైపు చూస్తున్నారు. సిగ్న‌ల్ , టెలిగ్రాం యాప్‌లు స్పీడందుకున్నాయి. వాట్సాప్ నిర్వాకం వ‌ల్ల త‌మ యాప్ డౌన్ లోడ్లు ల‌క్ష‌ల సంఖ్య‌లో పెరుగుతున్న‌ట్లు సిగ్న‌ల్ కో ఫౌండ‌ర్ బ్ర‌యాన్ యాక్ట‌న్ వెల్ల‌డించారు. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌న్నారు. మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ప్రైవసీ విధానాలు మారనుండటం .. దాని పోటీ సంస్థలకు ఊహించని వరంగా మారుతోంది.

వాట్సాప్‌ కొత్త పోకడలు నచ్చని యూజర్లు ఎకాయెకిన ఇతర మెసేజింగ్‌ యాప్స్‌ వైపు మళ్లుతున్నారు. దీంతో .. సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. వాట్సాప్‌ వివాదాస్పద మార్పులు ప్రకటించిన గత కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తమ యాప్‌ డౌన్‌లోడ్లు లక్షల సంఖ్యలో పెరిగాయని సిగ్నల్‌ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్‌ యాక్టన్‌ వెల్లడించారు. ఇక భారత మార్కెట్లో తమకు అంచనాలు మించిన ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

No comment allowed please