Uttam Kumar Reddy : సీఎంతో ఉత్తమ్ భేటీ
పోలీసు భర్తీలో జీవో నెం 46
Uttam Kumar Reddy : హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి సీఎం నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి చర్చించారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని ఎనుముల రేవంత్ రెడ్డికి అందజేశారు.
Uttam Kumar Reddy Met CM Revanth Reddy
ఖాకీల భర్తీలో అడ్డంకిగా ఉన్న జీవో నెంబర్ 46పై పునరాలోచించాలని కోరారు. దీని వల్ల ఎంతో మంది అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గతంలో కొలువు తీరిన కేసీఆర్ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు.
ఈ విషయం పై వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), ఎమ్మెల్యేలు విన్నవించారు. ఈ మేరకు 46 నెంబర్ జీవోపై పూర్తిగా సమీక్షించి కేబినెట్ లో చర్చించి తగు నిర్ణయం త్వరలోనే తీసుకుంటానని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : Election Commission : ఈసీ సంచలన నిర్ణయం