Uttam Kumar Reddy : పార్టీ మారుతానంటూ దుష్ప్రచారం
టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పార్టీలోనే కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉన్న ఓ ముఖ్య నాయకుడు తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. సదరు నాయకుడే తాను పార్టీని విడిచి పెడతానని, వేరే పార్టీలో చేరుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Uttam Kumar Reddy Comments
త్వరలోనే తనను అప్రతిష్టపాలు చేస్తున్న, కుట్రకు తెర తీసిన ఆ నాయకుడు ఎవరనేది త్వరలోనే బయట పెడతానని ప్రకటించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar reddy). ఈ మేరకు తాను పార్టీ హైకమాండ్ కు లేఖ రాశానని చెప్పారు. పార్టీ పరంగా తాను వ్యక్తిగతంగా కొంత అసంతృప్తికి లోనవుతూ ఉండవచ్చు. అయినంత మాత్రాన పార్టీని ఎలా వీడుతారని అనుకుంటున్నారంటూ ఎదురు ప్రశ్న వేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటి దొంగల కుట్రేనంటూ స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీలో ఉన్న తన అనుచరులను అణగ దొక్కేసేందుకు , వాళ్లను బయటకు వెళ్లగొట్టేందుకు సదరు నేత , ఆయన పరివారం కుట్రలు పన్నుతోందంటూ వాపోయారు. తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.
Also Read : Bhagwant Mann Comment : మనసున్నోడు భగవంత్ మాన్