Uttam Kumar Reddy : కాళేశ్వరం తెలంగాణకు శాపం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : మేడిగడ్డ – గతంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ పై, మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). మంత్రులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లను సందర్శించారు.
Uttam Kumar Reddy Comment
ఈ సందర్భంగా మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కేటీఆర్ ఇచ్చింది స్వేద పత్రం కాదని సోది పత్రం అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వాళ్లది దోపిడీ.. మేడిగడ్డ కుంగడం చిన్న విషయమే అయితే.. జనాలను ఎందుకు చూడనీయ లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరంలో కీలకమైన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అన్నీ వృథా.. నాగార్జున సాగర్ ఇంతకంటే స్టాండర్డ్ గా ఉందన్నారు.. మూడేళ్ల ప్రాజెక్టు లాగా కాళేశ్వరం లేదని ఇది పూర్తిగా నాణ్యత లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మేడిగడ్డ కుంగడంతో రెండో పంటకు సాగు నీటిపై సందిగ్ధత ఏర్పడిందన్నారు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచిస్తున్నామని.. మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు.. కాళేశ్వరం పై ఏం చేస్తాం అనేది ప్రకటన చేస్తాం.. ఇంత నాసిరకం నిర్మాణం ఎక్కడా చూడలేదన్నారు.
Also Read : DK Shiva Kumar : బాబుతో డీకే ములాఖత్