Uttarakhand Cable Car : 60 మంది తో గాలిలో ఆగిపోయిన కేబుల్ కార్

60 మంది వ్యక్తులు 45 నిమిషాల పాటు ఉండిపోయారు

Uttarakhand Cable Car : ఉత్తరాఖండ్‌లో టెహ్రీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అందులో బీజేపీ ఎమ్మెల్యేతో ఉత్తరాఖండ్‌లోని రోప్‌‌వే కేబుల్ కారు గాలిలో చిక్కుకుపోయిన(Uttarakhand Cable Car) ఘటన చోటుచేసుకుంది. 

టెహ్రీ జిల్లాలోని సుర్కందా దేవి టెంపుల్ రోప్‌వే కేబుల్ కారు నిలిచిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. దాంతో అందులో బీజేపీ ఎమ్మెల్యేతో సహా కనీసం 60 మంది వ్యక్తులు 45 నిమిషాల పాటు ఉండిపోయారు. 

ట్రాలీలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని తెహ్రీ గర్వాల్ ఎస్‌ఎస్‌పీ నవనీత్ భుల్లర్ చెప్పారు.అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పర్యాటకులను క్షేమంగా కిందకు దించారు. అనంతరం రోప్‌వే సజావుగా సాగుతుందని ఎస్‌ఎస్పీ నవనీత్ భుల్లర్ తెలిపారు. 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రోప్‌వే గాలిలో చిక్కుకోవడం చాలా తీవ్రమైన సమస్య అని అన్నారు. 

“మేము ఎవరి ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేం. నేను రోప్‌వే ఆపరేటర్లు సంబంధిత అధికారులతో చర్చిస్తాను” అని ఆయన అన్నారు. అటువంటి సంఘటన మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

Also Read : ములాయంను ప‌రామ‌ర్శించిన ‘యోగి’

Leave A Reply

Your Email Id will not be published!