Uttarakhand Teen Murder : ఉత్త‌రాఖండ్ లో ప్రజాగ్రహం ఉద్రిక్తం

మాజీ బీజేపీ మంత్రి త‌న‌యుడిపై ఆగ్ర‌హం

Uttarakhand Teen Murder : ఉత్త‌రాఖండ్ లో ఇంకా ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉన్న‌ది. ప‌రిస్థితి అదుపులోకి రావ‌డం లేదు. సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ విచార‌ణ‌కు హామీ ఇచ్చినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు నిర‌స‌న‌కారులు.

ఆదివారం భారీ సంఖ్య‌లో ఆందోళ‌న‌కారులు న్యాయం కోరుతూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. టీనేజ్ మృత‌దేహాన్ని(Uttarakhand Teen Murder) శ‌వ ప‌రీక్ష కోసం తీసుకు వెళ్లిన ఆస్ప‌త్రి స‌మీపంలో బ‌ద్రీనాథ్ – రిషికేశ్ హైవేను అడ్డుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌హిష్కృత నాయ‌కుడు వినోద్ కుమార్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య‌, అత‌డికి చెందిన రిసార్ట్ సిబ్బంది క‌లిసి హ‌త్య చేశార‌ని ఆరోపించారు.

రాష్ట్ర విప‌త్తు ప్ర‌తిస్పంద‌న ద‌ళం చిల్లా కెనాల్ నుండి మృత దేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ హ‌త్య ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు చెల‌రేగేందుకు కార‌ణ‌మైంది.

తుది శ‌వ ప‌రీక్ష నివేదిక వ‌చ్చేంత వ‌ర‌కు మృత దేహాన్ని ద‌హ‌నం చేసేందుకు నిరాక‌రించారు. తాత్కాలిక శ‌వ‌ప‌రీక్ష నివేదిక‌తో తాను సంతృప్తి చెంద‌లేద‌ని తండ్రి చెప్పారు.

తాత్కాలిక శ‌వ ప‌రీక్ష నివేదిక‌లో బాధితురాలికి మొద్దుబారిన గాయం ఉంద‌ని , మ‌ర‌ణం మునిగి పోవ‌డం వ‌ల్ల జ‌రిగింద‌ని తేలింది. శ‌ర‌రంపై పూర్వ‌పు గాయాలు కూడా ఉన్నాయ‌ని నివేదిక పేర్కొంది.

చివ‌రి పోస్ట్ మార్టం నివేదిక వ‌చ్చాకే అంత్య‌క్రియలు జ‌రిపిస్తామంటూ కుటుంబీకులు స్ప‌ష్టం చేశారు. సిట్ ను ఏర్పాటు చేశామ‌ని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తామ‌ని సీఎం త‌న‌కు చెప్పార‌ని తండ్రి తెలిపారు.

ఆమెను బ‌ల‌వంతంగా వ్య‌భిచార రొంపిలోకి దింపేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌న్న వాస్త‌వాన్ని ధ్రువీక‌రించే వాట్సాప్ చాట్ లు పోలీసుల వ‌ద్ద ఉన్నాయి.

Also Read : రోజు రోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులు

Leave A Reply

Your Email Id will not be published!