V Hanumantha Rao : బీసీలపై మోదీ కపట నాటకం
కాంగ్రెస్ సీనీయర్ నేత వీహెచ్
V Hanumantha Rao : హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హెనుమంత్ రావు(V Hanumantha Rao) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోని అడవుల్లో పులులు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది కానీ దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న బీసీలకు సంబంధించిన లెక్కలు లేక పోవడం దారుణమన్నారు వీ హనుమంత్ రావు.
V Hanumantha Rao Slams Modi
గతంలో హోం శాఖ మంత్రి హోదాలో రాజ్ నాథ్ సింగ్ ఈ మేరకు కుల గణన చేపడతామని చెప్పారని, ఆ హామీని ఇంత వరకు నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారని, నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు.
కుల గణనపై పార్లమెంట్ లో నిర్ణయం తీసుకోవాలని వీ హనుమంత రావు డిమాండ్ చేశారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు. జనాభాలో అగ్ర భాగాన ఉన్నా ఇప్పటి వరకు బీసీలకు న్యాయం జరగడం లేదని వాపోయారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. కుల గణనతోనే బీసీలకు మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు.
కేవలం అధికారం కోసం బీజేపీ కొత్త నాటకానికి తెర లేపిందన్నారు. ఓ వైపు ఎస్సీ, ఎస్టీలను ఇంకో వైపు బీసీలను ఓట్ల కోసం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు వి. హనుమంత రావు.
Also Read : R Krishnaiah : కుల గణన అంటే భయం ఎందుకు