V Srinivas Goud : రేవంత్ కలెక్షన్ కింగ్ – శ్రీనివాస్ గౌడ్
గద్దర్ పై కాల్పులకు చంద్రబాబే కారణం
V Srinivas Goud : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. తండ్రి వయసులో ఉన్న కేసీఆర్ పై అనుచిత కామెంట్స్ చేయడం దారుణమన్నారు. నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. గద్దర్ అందరి వాడు. అన్ని పార్టీలతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడని అన్నారు. ఆనాడు గద్దర్ పై కాల్పులకు కారణం ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. నిన్ను ఎగదోస్తున్న చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు వి. శ్రీనివాస్ గౌడ్.
V Srinivas Goud Serious Comments
గద్దర్ జై తెలంగాణ అనగానే కాల్పులకు తెగ బడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నక్సలైట్లను చర్చలకు పిలిచి తర్వాత వేల మందిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud). గద్దర్ మరణాన్ని రాజకీయం చేయాలని చూసిన రేవంత్ రెడ్డి ఆటలు సాగలేదన్నారు. అందుకే నోరు పారేసుకుంటున్నాడని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ పేమెంట్స్ కలెక్షన్ సెంటర్ గా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ద్రోహి పాత్ర, తుపాకీ రాముడి పాత్ర, కోవర్టు పాత్ర పోషించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. రేవంత్ ధ్యాసంతా బ్లాక్ మెయిలింగ్ మీదేనని పేర్కొన్నారు. ఆర్టీఐని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించావంటూ ఆరోపించారు. దేశంలో ఇలాంటి నీచమైన నేత పీసీసీ అధ్యక్షుడిగా ఎవరూ లేరన్నారు. మూడు నెలల్లో రేవంత్ కు ప్రజలు పిండం పెడతారంటూ స్పష్టం చేశారు.
Also Read :Priyanka Chaturvedi : ముందు మీ వారిని నిలదీయండి