V Srinivas Goud : పకడ్బందీగా మద్యం టెండర్ల డ్రా
స్పష్టం చేసిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
V Srinivas Goud : తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి దరఖాస్తులు ముగిశాయి. భారీ ఎత్తున వచ్చాయి. ఏకంగా ఈసారి 1,31,140 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అత్యధికంగా సరూర్ నగర్ , శంషాబాద్ నుంచి దరఖాస్తులు అందాయి. ఇక అత్యల్పంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు నిలిచాయి.
V Srinivas Goud Said Tenders will as a Lucky Draw
ఇదిలా ఉండగా ఆగస్టు 21 సోమవారం మద్యం టెండర్ల ప్రక్రియకు సంబంధించి డ్రా తీయనున్నట్లు రాష్ట్ర ఆబ్కారీ, ్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యంత పకడ్బందీగా మద్యం టెండర్లను లక్కీ డ్రా ద్వారా తీస్తామన్నారు. గతంలో లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు వి. శ్రీనివాస్ గౌడ్.
ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్లలో వీడియో చిత్రీకరణ ద్వారా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా చేపడతామన్నారు మంత్రి. టెండర్ల ప్రక్రియలో చిన్న తప్పు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాలు, నకిలీ , విదేశాల నుంచి వచ్చే మద్యాన్ని కట్టడి చేశామన్నారు. దీని వల్ల భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయని స్పష్టం చేశారు.
Also Read : Hamid Ansari : మన కాలంలో రాజీవ్ గొప్ప నేత