Telangana Medical Jobs : తెలంగాణ వైద్య విద్యలో ఖాళీల భర్తీ
నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ సర్కార్
Telangana Medical Jobs : తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతోంది. ఇదే సమయంలో వేగంగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టుకు సంబంధించి నియామకం చేయలేదు. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో(Telangana Medical Jobs) ఖాళీగా ఉన్న 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు గ్రూప్ 1, 2, 3, 4 లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఇక గ్రూప్ 1 కి సంబంధించి ప్రిలిమ్స్ పూర్తయింది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టుకు వెళ్లారు నిరుద్యోగులు. మరో వైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆయన ఏకంగా సీఎం కాళ్లు మొక్కడం విమర్శలకు తావిచ్చింది.ఇతను ఉంటే పోస్టులు ఎలా పారదర్శకంగా భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
వైద్య, విద్యా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అనాటమీ విభాగంలో 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిజియాలజీలో 26, అసిస్టెంట్ పాథాలజీ 31, కమ్యూనిటీ మెడిసిన్ 23, మైక్రో బయాలజీ 25, ఫోరెన్సిక్ మెడిసన్ 25 పోస్టులు ఉన్నాయి.
బయో కెమిస్ట్రీ 20, ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసన్ 14, జనరల్ మెడిసన్ 111, జనరల్ సర్జరీ 117, పిడియాట్రిక్ 77, అనిస్తీషియా 155, రేడియాలజీస్ 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియేషన్ యాంకాలజీ లో 05, సైకియాట్రి 23, రెసిపెటరీ మెడిసన్ 10, డెర్మటాలజీ మెడిసన్ 13, ఒబెస్ట్రిక్ అండ్ గైనకాలజీ 142, ఆప్తమాలజీ 8, ఆర్థో పెడిక్స్ 62, ఓటో రిహ్నో 15, హాస్పిటల్ అడ్మిన్ 14, ఎమర్జెన్సీ మెడిసన్ 15 , కార్డియాలజీ 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కార్డిక్ సర్జరీ 21, ఎండోక్రినోలజీ 12, న్యూరాలజీ 11, న్యూరో సర్జన్ 16, ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ 17 , పిడియాట్రిక్ సర్జరీ 8, యూరాలజీ 17, నెఫ్రాలజీ 10, మెడికల్ అంకాలజీ 1 పోస్టు ఖాళీగా ఉంది.
Also Read : గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి పచ్చ జెండా