KCR : తెలంగాణలో ఖాళీగా ఉన్న 80 వేల 39 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇందులో జోన్లు, మల్టీ జోన్ల వారీగా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి గ్రూప్ -1 , గ్రూప్ -2 , గ్రూప్ -3 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా జోన్లు, మల్టీ జోన్లకు సంబంధించి 32 వేల 36 జాబ్స్ ఉన్నాయని తెలిపారు కేసీఆర్(KCR). కాగా తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి ఏయే ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం.
ఇక నుంచి భర్తీ చేసే జాబ్స్ లు ఆర్డీఓ, డీఎస్పీ, సీటీఓ, ఆర్డీఓతో పాటు గ్రూప్ -1 ఉద్యోగాలన్నీ స్థానికి రిజర్వేషన్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు కేసీఆర్.
ఈ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభమవుతుందన్నారు. అన్ని యూనివర్శిటీల్లో 2, 020 బోధన పోస్టులు ఉండగా బోధనేతర 2, 774 జాబ్స్ ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా నేరుగా నియామకం చేపడతామన్నారు.
క్యాడర్ వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. జిల్లాల్లో 39 వేల 829 జాబ్స్ ఉండగా జోన్లలో 18 వేల 866 పోస్టులు , మల్టీ జోనల్ పోస్టులు 13 వేల 170 పోస్టులు ఉన్నాయని ప్రకటించారు కేసీఆర్.
సచివాలయం, హెచ్ఓడీలు, యూనివర్శిటీలలో 8, 147 జాబ్స్ భర్తీ చేస్తామన్నారు. కనిష్ట గరిష్ట వయో పరిమితి కూడా 10 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. దీని వల్ల ఎంతో మంది ఉద్యోగార్థులకు మేలు చేకూరుతుందన్నారు కేసీఆర్.
Also Read : తెలంగాణలో శాఖల వారీగా ఖాళీలు