CM Shivraj Singh Chouhan : గ్వాలియర్ లో అటల్ జీ స్మారక చిహ్నం
ప్రకటించిన సీఎం శివరాజ సింగ్ చౌహాన్
CM Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ప్రకటన చేశారు. మాజీ ప్రధాన మంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి సందర్భంగా గ్వాలియర్ లో ఆయనను నిత్యం స్మరించేందుకు గాను స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆడియో విజువల్ మాధ్యమం ద్వారా వాజ్ పేయ్ జీవితం, రచనలను హైలెట్ చేసేందుకు ఇ-లైబ్రరీ , పరిశోధనా కేంద్రం కూడా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్యా సింధియా, నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు. త్వరలోనే అటల్ జీ కి సంబంధించి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతే కాకుండా స్మారక చిహ్నంగా పరిశోధనా కేంద్రాని కూడా నిర్మిస్తామని వెల్లడించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(CM Shivraj Singh Chouhan) .
దివంగత నేత 98వ జయంతి సందర్భంగా గ్వాలియర్ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అటల్ బిహారీ వాజ్ పేయ్ డిసెంబర్ 25, 1924న గ్వాలియర్ లో పుట్టారు.
యుద్ద ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి. కాగా గ్వాలియర్ లోని సిరోల్ ప్రాంతంలో వాజ్ పేయ్ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రభుత్వం దాదాపు 4,050 హెక్టార్ల స్థలాన్ని కేటాయించిందని గ్వాలియర్ డివిజనల్ కమిషనర్ దీపక్ సింగ్ వెల్లడించారు.
దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ సాహసోపేతమైన చర్య భారత దేశాన్ని అణుశక్తిగా మార్చిందని అన్నారు. ఈ సందర్బంగా దేశం కోసం చేసిన కృషిని ప్రశంసించారు.
Also Read : తండ్రి రాజీవ్ కు తనయుడి నివాళి