Valluru Kranti : ఓటు కోసం వినూత్న ప్రచారం
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్
Valluru Kranti : జోగులాంబ జిల్లా – తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది. వజ్రాయుధం లాంటిదని భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లా కలెక్టర్ ప్రజలను ఓటు వేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ఆదేశించారు.
Valluru Kranti Comment
ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి(Valluru Kranti) వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇందులో భాగంగా ఓటు అన్నది ముఖ్యమని, ప్రతి ఒక్కరు తమకు దక్కిన ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరుతున్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా సరే ఓటు సరి చూసుకోవాలని, తమ కోసం పని చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. ఎవరికి ఓటు వేస్తారనేది మీ ఇష్టమని కానీ ఇంట్లో కూర్చోకుండా విలువైన ఓటు వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. ప్రస్తుతం ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.
Also Read : TTD Chairman : ఆధ్యాత్మికతకు సోపానాలు గ్రంథాలు