Vande Bharat Train : తిరుపతికి వందే భారత్ రైలు స్టార్ట్
సికింద్రాబాద్ నుంచి 16 బోగీలతో
Vande Bharat Train : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం ప్రారంభమైంది. 16 బోగీలతో కలిగిన ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలు దేరింది. గతంలో కంటే 15 నిమిషాలు ముందుగానే గమ్య స్థానం చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో ఈ ఎక్స్ ప్రెస్ కు ఆదరణ లభించిందని పేర్కొంది. మొదటి ట్రిప్ 109 శాతం ఆక్యుపెన్సీతో ప్రయాణం చేసిందని తెలిపింది. ప్రయాణీకుల నుండి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ కోచ్ ల సంఖ్యను పెంచింది. గతంలో 8 కోచ్ లు ఉండగా ఈసారి వాటిని 16 కోచ్ లకు రెట్టింపు చేసినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
మే 17 నుండి 530 సీట్ల నుండి 1,128 సీట్లకు పెంచినట్లు తెలిపింది. ఇందులో ఎక్జిక్యూటివ్ క్లాస్ లో 104 సీట్లు, చైర్ కార్ లో మరో 1,024 సీట్లు ఉన్నాయని వెల్లడించింది. భారీ ఎత్తున ఆదరణ లభించడంతో మొదటి ట్రిప్ లో 1,228 మంది ప్రయాణీకులు ముందే రైలు బుకింగ్ చేసుకున్నారని పేర్కొంది . సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8 గంటల 30 నిమిషాల వ్యవధికి బదులుగా 8 గంటల 15 నిమిషాలలో గమ్య స్థానానికి చేరుకుంటుందని తెలిపింది.
Also Read : Karnataka CM