Vangaveeti Radha : ఘనంగా వంగవీటి రాధా నిశ్చితార్థం
అక్టోబర్ లో వివాహానికి ముహూర్తం
Vangaveeti Radha : విజయవాడ – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా త్వరలో ఓ ఇంటి వాడు కానున్నారు. రాజకీయ కారణాల రీత్యా గత కొన్నేళ్లుగా పెళ్లికి దూరంగా ఉంటూ వచ్చారు. అనుకోకుండా తనకు తెలిసిన వారి అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది బెజవాడ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
Vangaveeti Radha Marriage Updates
వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగా పేరు పొందిన రాజకీయ నాయకుడు. ఆయనను దారుణంగా హత్య చేశారు.ఆ తర్వాత తల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తాజాగా వంగవీటి రాధా(Vangaveeti Radha) నిశ్చితార్థం జక్కం పుష్పవల్లితో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు హాజరయ్యారు. కాబోయే నూతన దంపతులను దీవించారు.
నిశ్చితార్థ కార్యక్రమం నరసాపురంలో జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బా రాయుడుతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రాధా చేసుకోబోయే భార్య పుష్పవల్లి స్వస్థలం నరసాపురం. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మణ్ణి, జక్కం బాబ్జీల కూతురే ఆమె. రాధా, పుష్పవల్లిల వివాహం అక్టోబరులో జరగనున్నట్లు టాక్.
Also Read : Corruption Comment : అవినీతి పరంపర ఫిర్యాదుల వెల్లువ