Varahi Yatra : మూడో విడత వారాహి యాత్ర
విశాఖపట్టణం నుంచి ప్రారంభం
Varahi Yatra : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర ఇప్పటి వరకు దిగ్విజయంగా సాగింది. తొలి, రెండో విడత వారాహి యాత్రలు పూర్తయ్యాయి. తాజాగా మూడో విడత వారాహి విజయ యాత్ర విశాఖపట్టణం నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.
Varahi Yatra Planning
ఈ యాత్రను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ లో మనోహర్ మాట్లాడారు.
ఇప్పటి వరకు జరిగిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో వారాహి విజయ యాత్ర(Varahi Vijaya Yatra) సక్సెస్ చేశారని ఇప్పుడు అంతకు మించి మూడో విడత వారాహి విజయ యాత్రను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి సంబంధించిన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు సమిష్టిగా పని చేయాలని , వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు.
ఇదిలా ఉండగా వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యారు. ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. వ్యక్తిగతంగా కూడా మాటల తూటాలు పేల్చారు.
Also Read : Cheekoti Praveen Bandi Sanjay : ‘బండి’తో ‘చీకోటి’ బిజీ