Varahi Yatra : 14 నుంచి పవన్ వారాహి యాత్ర
ఏపీలో ఎన్నికలే లక్ష్యంగా సభలు
Varahi Yatra : జనసేన పార్టీ చీఫ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా కింగ్ మేకర్ కావాలని చూస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఆశించిన దాని కంటే ఎక్కువగా ఓట్లను సాధించారు. ఈసారి అందుకు భిన్నంగా మరింత ప్రజల్లోకి వెళ్లేలా జనసేన ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
అన్ని వర్గాలను చేరదీస్తూనే మరో వైపు ఏపీలో కొలువు తీరిన సందంటి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా జన సైనికులు నిలదీసేలా చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరిగేందుకు కొంత కాలం ఉన్నప్పటికీ ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఓ వైపు భారతీయ జనతా పార్టీ సభలను స్టార్ట్ చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు సభలతో హోరెత్తిస్తుండగా కొడుకు నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర చేపట్టారు.
తాజాగా పవన్ కళ్యాణ్ స్వంతంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం యాత్ర జూన్ 14 నుండి ఏపీలో ప్రారంభం కానుంది. కత్తిపూడిలో సభ చేపడతారు. 16న పిఠాపురంలో , 18న కాకినాడలో , 20న ముమ్మిడివరంలో, 21న అమలాపురంలో , 22న పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా మలికిపురంలో బహిరంగ సభను నిర్వహించనుంది జనసేన పార్టీ. 23న నరసాపురంలో మొదటి విడత వారాహి యాత్ర ముగుస్తుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రకటించింది.
Also Read : Amit Shah PM Modi : యావత్ ప్రపంచం మోదీ జపం – షా