Varavara Rao NIA : వరవరరావు చర్యలు దేశానికి వ్యతిరేకం
జాతీయ దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టులో
Varavara Rao NIA : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక వ్యాఖ్యలు చేసింది విప్లవకవి వరవరరావుపై. ఆయన చర్యలు పూర్తిగా రాష్ట్రానికి, దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ స్పష్టం చేసింది.
ఈ మేరకు విప్లవకవికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
(మావోయిస్టు)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 2018 భీమా కోరేగావ్ హింసాకాండ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ విచారణకు ముందు 83 ఏళ్ల తెలుగు కవి వరవరరావుకు ఉపశమనం కల్పిస్తే ప్రత్యక్ష ప్రభావం
చూపుతుందని ఎన్ఐఏ వెల్లడించింది.
దేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వ భౌమాధికారానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆరోపించింది. ఇదిలా ఉండగా వైద్య పరమైన కారణాలతో వరవరరావుకు మధ్యంతర బెయిల్ ను ఆగస్టు 10 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.
నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్ఐఏ దాఖలు చేసిన అఫిడవిట్ లో భీమా కోరేగావ్ హింస కేసు
దర్యాప్తులో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి సాయుధ విప్లవం ద్వారా రాజకీయ అధికారాన్ని చేజిక్కించు కోవాలనే సీపీఐ మావోయిస్టు కేంద్ర లక్ష్యాన్ని చురుకుగా కొనసాగిస్తున్నారని ఆరోపించింది.
ఈ విషయాన్ని ఎన్ఐఏ(NIA) ఇన్స్ పెక్టర్ జనరల్ సంతోష్ రస్తోగి దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆరోపించారు. జూలై 19న అత్యున్నత
న్యాయ స్థానం వరవరరావు పిటిషన్ పై ఎన్ఐఏ ప్రతిస్పందననను కోరింది.
ఆయన ఇప్పటికే రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడని , వయస్సు పెరగడం, క్షీణిస్తున్న ఆరోగ్యం ఒక ప్రాణాంత కలయిక కాబట్టి ఇకపై
ఏదైనా జైలు శిక్ష మంచిది కాదని అభిప్రాయ పడింది.
బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22, 2021న వైద్య కారణాలతో ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. వరవరరావుకు(Varavara Rao) సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఆయన బెయిల్ ను పొడిగించింది.
Also Read : బీజేపీపై మహూవా మోయిత్రా ఫైర్