Varla Ramaiah : సీఎంఓ కార్యాల‌యం అవినీతిమ‌యం

టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్యులు వ‌ర్ల రామ‌య్య

Varla Ramaiah : తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో స‌భ్యులు వ‌ర్ల రామ‌య్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో దొంగ‌లు ప‌డ్డార‌ని, పూర్తిగా అవినీతిమ‌యంగా మారింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం వ‌ర్ల రామ‌య్య(Varla Ramaiah) మీడియాతో మాట్లాడారు. సీఎంఓలో సీఎంకి అధికారుల‌కు తెలియ‌కుండా కింది స్థాయి ఉద్యోగుల అధికారుల డిజిట‌ల్ సిగ్నేచ‌ర్స్ లో లాగిన్ అయ్యి కొన్ని ఫైల్స్ క్లియ‌ర్ చేశార‌ని పోలీసు కేసు పెట్టి కింది స్థాయి ఉద్యోగుల‌ను అరెస్ట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

Varla Ramaiah Comments

ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌కుండా ఫైల్స్ సీఎం సంత‌కంతో ఆమోదం పొంద‌కుండా కింది స్థాయి ఉద్యోగులు ఆ ఫైల్స్ ఎలా క్లియ‌ర్ చేస్తారంటూ వ‌ర్ల రామ‌య్య ప్ర‌శ్నించారు. ముమ్మాటికీ ఈ ఫైల్స్ అన్నీ పై అధికారుల‌కు తెలిసే దొంగ డిజిటల్ సంత‌కాల‌తో , దురుద్దేశ పూర్వ‌కంగా నే లాగిన్ చేశారంటూ ఆరోపించారు. పై అధికారుల‌ను అరెస్ట్ చేయ‌కుండా తుతూ మంత్రంగా కింది స్థాయి వారిని బ‌లి చేస్తే ఎలా అని మండిప‌డ్డారు వ‌ర్ల రామ‌య్య‌.

సీఎంలోని వ‌సూల్ రాజాకు తెలియ‌కుండా ఏ ఫైల్ న‌డ‌వ‌ద‌న్నారు. మిస్ట‌ర్ 20 శాతం అవినీతి సంపాద‌న‌పై ద‌ర్యాప్తు చేయ‌డం కోసం ఇద్ద‌రు రిటైర్డ్ పోలీసు అధికారుల‌ను త‌మ పార్టీ నియ‌మించింద‌న్నారు.

Also Read : Buggana Rajendranath Reddy : రూ. 200 కోట్లతో 50 స‌బ్ ట్రెజ‌రీలు

Leave A Reply

Your Email Id will not be published!