Varudu Kalyani : బాబూ ఆ 20 వేల కోట్లు ఎక్క‌డివి..?

నిప్పులు చెరిగిన వ‌రుదు క‌ళ్యాణి

Varudu Kalyani : విశాఖ‌ప‌ట్ట‌ణం – వైసీపీ మ‌హిళా విభాగం చీఫ్ , ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతి పెద్ద అవినీతికి చ‌క్ర‌వ‌ర్తి బాబు అంటూ ఎద్దేవా చేశారు.

Varudu Kalyani Slams Chandrababu

గాడ్సే క‌న్నా నీచుడు చంద్ర‌బాబు అంటూ స్వంత మామ, మాజీ సీఎం ఎన్టీఆర్ ఆనాడే చెప్పార‌ని ఇవాళ అది నిజ‌మైంద‌న్నారు. అబ‌ద్దాల్లో చంద్ర‌బాబును మించి పోయింది భువ‌నేశ్వ‌రి అంటూ మండిప‌డ్డారు. ఒక‌నాడు కేవ‌లం 2 ఎకరాలు మాత్ర‌మే ఉన్న టీడీపీ చీఫ్ కు ఇవాళ రూ. 20 వేల కోట్ల ఆస్తులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు వ‌రుదు క‌ళ్యాణి.

2016లో రూ. 57 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్టు చూపించిన మీరు ఉన్న‌ట్టుండి ఏడేళ్ల కాలంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో, ఏ క‌ష్టం చేస్తే వ‌చ్చిందో చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. పోనీ పాలు, కూర‌గాయ‌లు అమ్మి సంపాదించారా అని నిల‌దీశారు.

స్కిల్ స్కాం లో అడ్డంగా బుక్కైన గ‌జ‌దొంగ చంద్ర‌బాబు కోసం దొంగ దీక్ష‌లు ఎలా చేప‌డ‌తారంటూ మండిప‌డ్డారు వ‌రుదు క‌ళ్యాణి(Varudu Kalyani). లంచాలు తిన్నోడికి కంచాలు కొట్ట‌డం ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు. అవినీతి అన‌కొండ‌ల‌కు ఎలా మ‌ద్ద‌తు ఇస్తారంటూ మండిప‌డ్డారు . దేశం కోసం త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన మ‌హాత్ముడి రోజున దీక్ష చేప‌ట్టి అవ‌మానించారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Also Read : Chandra Babu Case : చంద్ర‌బాబుకు చుక్కెదురు

Leave A Reply

Your Email Id will not be published!