Varudu Kalyani : ప‌వ‌న్ ప్ర‌జా కోర్టులో తేల్చుకుందాం

వైసీపీ మహిళా విభాగం వ‌ర్కింగ్ చీఫ్

Varudu Kalyani : ప‌వ‌న్ క‌ళ్యాణ్ , చంద్ర‌బాబు నాయుడిపై నిప్పులు చెరిగారు వైసీపీ రాష్ట్ర మ‌హిళా విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ వ‌రుదు క‌ళ్యాణి. ప్ర‌జా కోర్టులో నీతో పాటు చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌, లోకేష్ , నారాయ‌ణ‌ల‌ను విచారించే ద‌మ్ము నీకు ఉంద‌న్నారు. బుధ‌వారం విశాఖ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో మ‌హిళ‌ల అదృశ్యంపై మోదీని ప్ర‌శ్నించే ద‌మ్ము నీకుందా అని ప్ర‌శ్నించారు . దేశంలోనే అత్యంత అట్ట‌ర్ ప్లాప్ , విజ‌న్ లేని నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు అంటూ ఎద్దేవా చేశారు.

Varudu Kalyani  Serious Comments

రాష్ట్రంలో జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో మ‌హిళ‌లు సుర‌క్షితంగా ఉన్నార‌ని అన్నారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో మ‌హిళా ఎమ్మెల్సీగా ప‌ని చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. మీలా మ‌హిళ‌లు ఎప్పుడూ ఫీల్ కాలేద‌న్నారు. ఇదంతా కావాల‌ని జ‌గ‌న్ రెడ్డిపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు వ‌రుదు క‌ళ్యాణి(Varudu Kalyani). ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం త‌ప్ప చేసింది ఏమీ లేద్నారు.

మ‌హిళ‌ల‌కు కాస్తంత గౌర‌వం ఇవ్వ‌ని చ‌రిత్ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ ది అని ఎద్దేవా చేశారు. తెలంగాణ‌లో దిశ ఘ‌ట‌న జ‌రిగితే అలాంటి ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో రాకూడ‌ద‌ని జ‌గ‌న్ రెడ్డి ఏకంగా చ‌ట్ట‌మే తీసుకు వ‌చ్చార‌ని అన్నారు వ‌రుదు క‌ళ్యాణి. సీఎం అయ్యాక 15 వేల మంది మ‌హిళ‌ల‌ను పోలీసులుగా నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం దిశ ఠాణాల‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డిద‌న్నారు.

Also Read : SSA Employees Dharna : ఎస్ఎస్ఏ ఉద్యోగుల అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!