Varun Gandhi : యోగి ఏరియల్ సర్వేపై వరుణ్ గాంధీ ఫైర్
ప్రజల ఇబ్బందులు ఎవరు పరిష్కరిస్తారు
Varun Gandhi : మరోసారి చర్చనీయాంశంగా మారారు భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi). ఆయన కాషాయ పార్టీకి చెందిన వారైనప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా కేంద్రాన్ని, రాష్ట్రంలో యోగి సర్కార్ ను ఏకి పారేస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య నెలకొన్నా దానిని వదలడం లేదు.
దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరొందారు వరుణ్ గాంధీ. తాజాగా ఆయన శనివారం చేసిన ట్వీట్ కలకలం రేపింది. బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల దెబ్బకు ఇళ్లు కూలి పోయాయి. పలువురు గోడలు కూలి ప్రాణాలు కోల్పోయారు.
ఇదే సమయంలో బాధితులను పరామర్శించాల్సిన సీఎం యోగి ఆదిత్యా నాథ్ (CM Yogi) ఉన్నట్టుండి సమీక్షలకు , ఏరియల్ సర్వేలకే పరిమితం అయితే ఎలా అని ప్రశ్నించారు వరుణ్ గాంధీ. రాష్ట్రానికి బాధ్యత వహించాల్సిన ముఖ్యమంత్రి ప్రజల బాధలు స్వయంగా తెలుసు కోకుండా ఇలా ఏరియల్ సర్వే చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఏరియల్ సర్వే వల్ల ప్రజా సమస్యలు, ఇబ్బందులు ఎలా తెలుసుకుంటారని నిలదీశారు యోగి ఆదిత్యానాథ్ ను. ఓ వైపు రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతుంటే ఇంకో వైపు యూపీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (యుపీఎస్సీ) కు సంబంధించి ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ టెస్ట్ (పిఇటి) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
యుపీలోని పిలిభిత్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు వరుణ్ గాంధీ. అనేక మంది పరీక్ష కోసం రైళ్లను ఆశ్రయించారని, అవి సరి పోవడం లేదని పేర్కొన్నారు. ఈ సమయంలో ఏరియల్ సర్వే చేపట్టడం ఎంత వరకు సబబు అని పేర్కొన్నారు.
Also Read : మరో కాశ్మీరీ పండిట్ కాల్చివేత