Varun Gandhi : బీజేపీ నేతలపై వరుణ్ గాంధీ ఫైర్
నిరసనకారులను జిహాదీలు అంటారా
Varun Gandhi : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. పలు చోట్లా ఆందోళనలు కొనసాగుతూ వస్తున్నాయి.
ఈ తరుణంలో బీహార్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ భూషణ్ ఠాకూర్ బచ్చౌల్ అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన యువకులను జిహాదీలుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇది మంచి పద్దతి కాదన్నారు. వారిపై దాడులకు పాల్పడితే, కాల్చి వేస్తే దానిని ఏమనాలంటూ ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం సరికాదని సూచించారు.
చట్ట సభల్లోకి వెళుతున్న ప్రజా ప్రతినిధులకు ఐదేళ్లు, ఆరేళ్ల పాటు సమయం ఇచ్చిన వారు యువకులకు నాలుగు సంవత్సరాల పాటే ఎలా ఇస్తారంటూ వరుణ్ గాంధీ ప్రశ్నించారు.
యువకులు తరతరాల నుంచి త్రివిధ దళాలలో చేరి దేశానికి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ దేశానికి సేవ చేయాలన్న తలంపు ఉంటుందన్నారు వరుణ్ గాంధీ.
యువకులు తమ ప్రాణాలను పణంగా పెడతారని, అలాంటి వారిని తక్కువ చేసి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా బీహార్ లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
హింసాకాండ, దహనాల వెనుక జిహాదీల హస్తం ఉందంటూ సదరు ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు.
మొత్తం మీద గత కొంత కాలంగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi) నిప్పులు చెరుగుతూ వస్తున్నారు.
Also Read : రాష్ట్రపతి పదవి రేసులో యశ్వంత్ సిన్హా