Varun Gandhi : జెండా..రేషన్ లేక పోవడం సిగ్గు చేటు
కేంద్ర ప్రభుత్వంపై వరుణ్ గాంధీ ఫైర్
Varun Gandhi : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారితే అది దురదృష్టకరమన్నారు.
విచిత్రం ఏమిటంటే ఎగిరేసేందుకు జాతీయ జెండా లేదు. కనీసం తినేందుకు రేషన్ లేక పోవడం సిగ్టు చేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కొంత కాలం నుంచీ మోదీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
ఆయన రేషన్ షాప్ లను సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను రూ. 20కి బలంతంగా కొనుగోలు చేశారంటూ ఆరోపించారు ఎంపీ వరుణ్ గాంధీతో(Varun Gandhi). దీనిపై వీడియోను ట్విట్టర్ వేదికగా బుధవారం షేర్ చేశారు.
రేషన్ కార్డు దారులు జాతీయ జెండాను బలవంతంగా కొనుక్కోవడం లేదా వారికి రావాల్సిన రేషన్ లో వాటా నిరాకరించడం , పేదల కంచాన్ని లాక్కోవడం దురదృష్టకరమన్నారు.
ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిన తిరంగ ధరను లాగేసు కోవడం సిగ్గు చేటుగా ఆయన పేర్కొన్నారు వరుణ్ గాంధీ..
హర్యానా లోని కర్నాల్ లోని ఒక న్యూస్ పోర్టల్ లో రికార్డు చేసిన వీడియోలో ప్రజలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిపోలో రేషన్ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో రూ. 20 చెల్లించి జాతీయ జెండాను బలవంతంగా కొనుగోలు చేశామని వాపోయారు.
రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరు జాతీయ జెండాను కొనుగోలు చేయాలని, తమ ఇళ్లల్లో పెట్టుకోవాలని ఆర్డర్లు వచ్చాయని చెప్పడం దారుణమన్నారు వరుణ్ గాంధీ.
Also Read : బీజేపీ జాతీయ వాదానికి అర్థం లేదు