Vasireddy Padma : విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై(Vasireddy Padma) టీడీపీ దాడి చేయడం. ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించేందుకు ఆమె వెళ్లారు.
కుటుంబీకుల్ని ఓదార్చారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన తనపై టీడీపీ మూకలు దౌర్జన్యానికి పాల్పడ్డాయంటూ ఆరోపించారు వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma).
టీడీపీ కావాలని చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు. మహిళల పట్ల రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు ఛీ కొట్టినా తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు, అనుచరులకు బుద్ది రావడం లేదని మండిపడ్డారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను బెదిరించే స్థాయికి బాబు దిగజారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె చెప్పారు.
నేను ఆస్పత్రికి వెళ్లే సరికి టీడీపీ నాయకుడు వస్తున్నాడని నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. తనను వెళ్ల నీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఆస్పత్రి వద్ద రాజకీయాలు చేయడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చానని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు కావాలని గలాటా సృష్టించాలని చూశారని ఆరోపించారు వాసిరెడ్డి పద్మ.
బాధితురాలితో మాట్లాడుతుండగా బోండ ఉమా అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ నిప్పులు చెరిగారు. నాతో చాలా అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు. అంతే కాకుండా చంద్రబాబు విచక్షణ మరిచి పోయారు.
తనను బెదిరించే ప్రయత్నం చేశారంటూ నిప్పులు చెరిగారు. బోండా ఉమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
Also Read : పట్టు కోసం జగన్ వైజాగ్ టూర్