CM Yogi : భ‌విష్య‌త్తులో వ్యాట్..ప‌న్నులు పెంచం

ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం

CM Yogi : ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో స‌మీప భ‌విష్య‌త్తులో కొత్త ప‌న్ను లేదా వ్యాట్ పెంచ బోమంటూ వెల్ల‌డించారు.

ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన మొత్తాన్ని (డ‌బ్బుల్ని) రాష్ట్ర అభివృద్ది, సంక్షేమం కోసం వినియోగిస్తామ‌ని చెప్పారు. ప్ర‌జల‌కు ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాల‌కు కేటాయిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్.

ఈ మేర‌కు సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi)  ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. విలువ ఆధారిత ప‌న్ను (వ్యాట్ ) ను స‌మీపంలో పెంచే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

గ‌తంలో కూడా వ్యాట్ పెంచ‌లేద‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్త‌గా ఎలాంటి ప‌న్ను విధించ లేద‌ని స్ప‌ష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్. త‌న నివాసంలో జ‌రిగిన ఆదాయ వ‌సూళ్ల‌కు సంబంధించిన రాష్ట్ర ప‌న్నుల శాఖ స‌మావేశానికి సీఎం అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్ర‌జ‌ల‌పై భారం మోప బోమ‌ని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి , వ‌స్తు , సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) , వ్యాట్ గా రూ. 1.50 లక్ష‌ల కోట్ల‌ను వ‌సూలు చేసే ల‌క్ష్యంతో ఆదాయ సేక‌ర‌ణ‌కు సంబంధించి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేయాల‌ని సీఎం ఆదేశించారు.

వ‌చ్చే 6 నెల‌ల్లో జీఎస్టీలో న‌మోదైన వ్యాపారుల సంఖ్య‌ను 4 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని యోగి సూచించారు. జీఎస్టీ రిజిస్ట్రేష‌న్ , రిట‌ర్న్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి వ్యాపారుల‌కు తెలియ చేయాల‌న్నారు.

వ‌చ్చే 6 నెల‌ల్లో జీఎస్టీలో న‌మోదైన వ్యాపారుల సంఖ్య‌ను 4 లక్ష‌ల‌కు పెంచాల‌ని ఆదేశించారు సీఎం(CM Yogi) .

Also Read : మేడం త‌ప్పైంది మ‌న్నించండి

Leave A Reply

Your Email Id will not be published!