VC Sajjanar : గ‌ద్ద‌ర్ పేరు కాదు ఒక బ్రాండ్ – స‌జ్జ‌నార్

ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఘ‌న నివాళి

VC Sajjanar : ప్ర‌జా వాగ్గేయ‌కారుడు గ‌ద్ద‌ర్ కు విన‌మ్రంగా నివాళి అర్పించారు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్(VC Sajjanar). గ‌ద్ద‌ర్ ఇది పేరు కాదు ఒక బ్రాండ్ . విప్ల‌వ ప్ర‌యాణానికి ర‌థ సార‌థి ఆయ‌న అని కొనియాడారు. పేద‌ల ప‌క్షాన జ‌రిగే పోరాటాల‌కు వెన్న ముక‌. ఎన్నో ప్ర‌భుత్వాల‌ను ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించాడు. పాట‌ల‌తో నిల‌దీశార‌ని కొనియాడారు.

VC Sajjanar Tributes to Gaddar

పాట అంటే చెవుల‌తో కాదు వినేది..పాటంటే గుండెల‌తో విని మెద‌డులో ఆలోచ‌న‌లు రేపేది అని ప‌ర‌మార్థాన్ని చెప్పిన మ‌హా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అని పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌జ్జ‌నార్ స్పందించారు. పాటంటే మాట‌ల‌తో తూటాల‌ను ఎక్కు పెట్టి, అన్యాయ‌పు మ‌ర్మాన్ని ర‌ట్టు చేయాల‌ని చెప్పార‌న్నారు.

ఎన్నో ప్ర‌జా పోరాటాల‌ను ముందుండి న‌డిపించి, అన్ని ప‌క్షాల ప్ర‌జ‌ల‌ను క‌లుపుకుని స‌మ స‌మాజ నిర్మాణానికి అలు పెరుగ‌ని పోరాటం చేసిన యోధుడు గ‌ద్ద‌ర్ అని పేర్కొన్నారు. మృత్యువుతో పోరాడి ఓడినా ప్ర‌జ‌ల నాలుక‌ల‌పై పాటై చిరంజీవిగా నిలిచిన గ‌ద్ద‌ర్ కు టీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం త‌ర‌పున , ఉద్యోగుల ప‌క్షాన నివాళులు అర్పిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు వీసీ స‌జ్జ‌నార్.

గ‌ద్ద‌ర్ తో త‌న‌కు 10 ఏళ్ల‌కు పైగా ప‌రిచ‌యం ఉంద‌న్నారు. తెలంగాణ ఉద్య‌మంలో త‌న పాత్ర గురించి చెప్పార‌ని తెలిపారు. ఉద్య‌మం అంటే స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా జ‌రిపే పోరాటం కాద‌ని ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడు కోవ‌డ‌మ‌ని చెప్పార‌ని గుర్తు చేశారు. చిన్న వారైనా పెద్ద వారైనా అన్నా అని పిలిచే వార‌ని బాధ ప‌డ్డారు వీసీ స‌జ్జ‌నార్. ఆయ‌న లేక పోవ‌డం బాధాక‌రమ‌ని ఆవేద‌న చెందారు.

Also Read : Gaddar Final Rites : చివ‌రి చూపు కోసం జ‌న సందోహం

Leave A Reply

Your Email Id will not be published!