VC Sajjanar : త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు – స‌జ్జ‌నార్

1300 బ‌స్సులు రానున్నాయ‌ని వెల్ల‌డి

VC Sajjanar : హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు తీపి క‌బురు చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్. త్వ‌ర‌లో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన విద్యుత్ బ‌స్సులు తీసుకు వ‌స్తామ‌న్నారు. ఈ మేర‌కు గ్రేటర్ హైద‌రాబాద్ లో 1300 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను వాడకంలోకి తీసుకు రావాల‌ని సంస్థ నిర్ణ‌యించింద‌న్నారు.

VC Sajjanar Announce

ప‌ర్యావ‌ర‌ణ హితం, కాలుష్య నివార‌ణ‌తో పాటు ప్ర‌జ‌ల‌కు మెరుగైన , సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణ అనుభూతిని క‌లిగించేందుకు ఈ బ‌స్సుల‌ను అందుబాటు లోకి తీసుకు రాబోతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఆర్టీసీ ఎండీ(VC Sajjanar). త్వ‌ర‌లో 25 ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సుల‌ను ప్ర‌వేశ పెట్ట‌బోతున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సును వీసీ స‌జ్జ‌నార్ ప‌రిశీలించారు. బ‌స్సులో ప్ర‌యాణీకుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల గురించి ఆరా తీశారు. ప‌లు సూచ‌న‌లు చేశారు. వీలైనంత త్వ‌ర‌గా బ‌స్సుల‌ను అందుబాటు లోకి తీసుకు రావాల‌ని ఆదేశించారు ఎండీ.

ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కు 550 విద్యుత్ బ‌స్సులు ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో 500 బ‌స్సులను హైద‌రాబాద్ సిటీలో మిగ‌తా 50 బస్సుల‌ను విజ‌య‌వాడ మార్గంలో న‌డ‌పాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. ఇప్ప‌టికే విజ‌య‌వాడ రూట్ లో 10 విద్యుత్ బ‌స్సులు న‌డుస్తున్నాయ‌ని తెలిపారు. ఇక 20 శంసాబాద్ ఎయిర్ పోర్ట్ దారిలో , 30 ఐటీ కారిడార్ లో న‌డుస్తాయ‌ని పేర్కొన్నారు వీసీ స‌జ్జ‌నార్.

Also Read : Nara Lokesh : జ‌హీరుద్దీన్ మ‌ర‌ణం బాధాక‌రం

Leave A Reply

Your Email Id will not be published!