Vedant Patel :అమెరికాలో కొలువు తీరిన బైడెన్ ప్రభుత్వంలో అత్యధిక పోస్టులలో ప్రవాస భారతీయులే ఎక్కువగా ఉన్నారు. కీలక పదవుల్లో వారే హవా కొనసాగిస్తున్నారు.
తాజాగా ఎన్నారై అయిన వేదాంత్ పటేల్(Vedant Patel) పనితీరుపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మేధోతనం, ప్రతిభా సంపత్తి అద్భుతమంటూ కొనియాడారు.
వేదాంత్ పటేల్ ప్రతిరోజూ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కు సహాయం చేస్తారంటూ పేర్కొన్నారు. వేదాంత్ పటేల్ ది స్వస్థలం గుజరాత్. ఆయన యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఫ్లోరిడా యూనివర్శిటీ నుంచి పట్టాలు పొందారు.
ఎంబీఏలో మంచి పట్టు సాధించారు. పటేల్ (Vedant Patel) గుజరాత్ లో పుట్టినా జీవితం అంతా కాలిఫోర్నియాలోనే గడిచింది. ఈ 32 ఏళ్ల వేదాంత్ పటేల్ పనితీరు అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నారు చీఫ్ సెక్రటరీ.
పటేల్ ప్రస్తుతం వైట్ హౌస్ లో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ఉన్నారు. తాజాగా జెన్ ప్సాకీ వేదాంత్ పటేల్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనను మోస్ట్ సూపర్ టాలెంటెడ్ పర్సన్ అంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
మేము ప్రతి రోజూ అసైన్ మెంట్స్ ఇస్తూనే ఉంటాం. కానీ తమకు సాధ్యం కాని దానిని వేదాంత్ పటేల్ పరిష్కరించడం తమను ఆశ్చర్య పోయేలా చేస్తోందంటారు ఆమె.
ఈ విషయాన్ని వేదాంత్ పటేల్ సమక్షంలోనే మీడియా ముందు పొగడ్తలతో ముంచెత్తారు. వేదాంత్ అద్భుతమైన రచయిత. భవిష్యత్తులో ఆయన మరింత ముందుకు వెళ్లగలడని పేర్కొన్నారు జెన్ ప్సాకీ.
Also Read : భారతీయులకు అమెరికా శుభవార్త