#Viral : పార్క్ చేసిన బండి దానంతట అది ఎలా కదిలింది?
ఈ బైక్ ఎలా కదిలింది??
Viral : మానవుల మేధస్సుకు నిదర్శనమైన సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి చెందిన ప్రపంచంలో ప్రశ్నలుగా మిగిలిన ఎన్నో చిక్కుముడులకు సమాధానాలు చెప్పలేక పరిశోధకులు తికమక పడుతున్నారు.ఉన్నవి చాలవనట్టు అప్పుడప్పుడు కొన్ని కొత్త ప్రశ్నలు పరిశోధకులకు తారసపడి మరిన్ని ఇబ్బందులను కలిగిస్తున్నాయి.
ఇక తాజాగా గుజరాత్ లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం పరిశోధకులకు పెద్ద సవాల్ గా మారింది.అసలేం జరిగిందంటే గుజరాత్ రాష్ట్రంలో ఒక పార్క్ చేసిన మోటార్ బైక్ దానంతట అదే టర్నింగ్ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై కింద పడిపోయింది. బండి పైన కానీ, పక్కన కానీ ఎవరూ లేకపోవడం గమనార్హం.ఈ సంఘటనను చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా మిగతా యూజర్స్ తో పంచుకుంది.
ఇది చూసినవారంతా ఇదేలా సాధ్యమంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో పై మీరు కూడా లుక్ వేసి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
कैमरे में कैद हो गया वरना कोई यकीन नहीं करता pic.twitter.com/ebHGTeSQJK
— Amber Zaidi (@Amberological) February 2, 2021

No comment allowed please