Venkaiah Naidu : హైదరాబాద్ ముచ్చింతల్ ఇప్పుడు ఐకాన్ గా మారి పోయింది. నిన్న మొన్నటి దాకా ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామ్ దేవ్ బాబా సందర్శించారు.
వందలాది మంది ప్రముఖులు కూడా విచ్చేశారు. ఇక భారత రంగానికి సంబంధిచిన డీఆర్డీఓ చీఫ్ సతీష్ రెడ్డి, గవర్నర్లు , సీఎంలు కూడా సాగిల పడ్డారు. ఇది ఒక విచిత్రకరమైన సన్నివేశం.
సినీ రంగానికి సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు చిరంజీవి కూడా సమతామూర్తి కేంద్రం బాట పట్టారు. ఇక భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు(Venkaiah Naidu ) కూడా స్వామి సన్నిధికి రానున్నారు.
ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేసీఆర్, జగన్ ..ఇలా చెప్పుకుంటూ పెద్ద జాబితా అవుతుంది. ఉప రాష్ట్రపతి రాకతో సమతా ప్రాంగణం చుట్టూ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఇవాల్టితో 11వ రోజుకు చేరుకున్నాయి. నిన్న రామ్ దేవ్ బాబా, గణపతి సచ్చిదానంద స్వామి హాజరయ్యారు. సమతామూర్తి విగ్రహం ఆధ్యాత్మికతకు చిహ్నమని కొనియాడారు రామ్ దేవ్ బాబా.
దక్షిణాదిన ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతుందని సెలవిచ్చారు గణపతి సచ్చిదానంద. రామానుజుడి బోధించిన మార్గం మనందరికీ ఆదర్శనీయమని బోధించారు.
ఇదిలా ఉండగా రూ. 1000 కోట్లు ఖర్చు చేశారు. 216 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 108 దివ్య దేశాలు ఉన్నాయి.
Also Read : రామానుజుడు ఆధ్యాత్మిక విప్లవకారుడు