Venkaiah Naidu : గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విపై వెంక‌య్య కామెంట్స్

అలంకారం కాదు రాజ‌కీయం అంత‌క‌న్నా కాదు

Venkaiah Naidu : దేశ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో కొంత కాలం నుంచీ గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అన్న‌ది రాజ్యాంగ బ‌ద్ద‌మైన‌ది.

పార్టీల‌కు అతీత‌మైన‌ది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆ పోస్టు అలంకార‌మూ కాదు అంత‌కు మించి రాజ‌కీయం కాద‌న్నారు. ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అందించే కార్య‌క్ర‌మాల‌ను సక్ర‌మంగా అమ‌లు చేసేలా చూడాల‌ని గ‌వ‌ర్న‌ర్ల‌కు సూచించారు ఉప రాష్ట్ర‌ప‌తి.

గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఉప రాష్ట్ర‌ప‌తి. ఇదిలా ఉండ‌గా ఉప రాష్ట్ర‌ప‌తిగా త‌న ప‌ద‌వీ కాలం ఇంకా కేవ‌లం ఒక నెల మాత్ర‌మే ఉంది.

ఈ త‌రుణంలో రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు ఎలా ఉండాలో, ఎలా న‌డుచు కోవాలో ఎలా మార్గ‌నిర్దేశ‌నం చేయాలో స్ప‌ష్టం చేశారు వెంక‌య్య నాయుడు(Venkaiah Naidu). అది అలంకార‌ప్రాయం అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లేన‌ని పేర్కొన్నారు.

ఆయా గ‌వ‌ర్న‌ర్ల ప్ర‌వ‌ర్త‌న రాష్ట్రాల ప‌రిపాల‌న‌కు ఓ ఉదాహ‌ర‌ణగా ఉండాల‌ని హిత‌బోధ చేశారు ఉప రాష్ట్ర‌ప‌తి. గ‌వ‌ర్న‌ర్లు, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్లు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందిన అడ్మినిస్ట్రేట‌ర్ల‌ను ఉద్దేశించి త‌న అధికారిక నివాసంలో విందు భోజ‌నం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్లు త‌మ రాష్ట్రంలోని యూనివ‌ర్శిటీల‌ను త‌రుచుగా సంద‌ర్శంచాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ కావాల‌ని బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలను గ‌వ‌ర్న‌ర్లను అడ్డం పెట్టుకుని ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు ఆయా రాష్ట్రాల సీఎంలు.

ఈ త‌రుణంలో వెంక‌య్య నాయుడు(Venkaiah Naidu) చేసిన ఘాటు వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

Also Read : ఉప రాష్ట్ర‌ప‌తి బ‌రిలో మార్గ‌రెట్ అల్వా

Leave A Reply

Your Email Id will not be published!