M Venkaiah Naidu : ప్రజలే ఖర్చు పెట్టి గెలిపించారు – వెంకయ్య
ఇవాళ అలాంటి వాతావరణం లేదని ఆవేదన
M Venkaiah Naidu : ఇవాళ డబ్బులు భారీగా ఖర్చు చేస్తేనే గెలిచే అవకాశం ఉందని, అత్యంత కాస్ట్ లీగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. సోమవారం నెల్లూరు జిల్లాలోని దుత్తలూరులో మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాను ఉదయగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు ప్రజలే స్వంత డబ్బు లు పెట్టి గెలిపించారని అన్నారు. ఉదయగిరి ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి, ప్రేమాభిమానాలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు ముప్పవరపు వెంకయ్య నాయుడు(Venkaiah Naidu).
ఉదయగిరికి తనకు విడదీయలేని బంధం ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను ఢిల్లీ స్థాయికి తీసుకు వెళ్లేలా చేశారని కొనియాడారు మాజీ ఉప రాష్ట్రపతి. పైసా ఖర్చు లేకుండా తాను ఇక్కడి నుంచి గెలుపొందానని , జనం వాయిస్ ను వినిపించానని అన్నారు.
ఆనాడు పోటీ చేసినప్పుడు డబ్పులు పంచే సంస్కృతి లేదన్నారు. పైగా ప్రజలే తిరిగి తన కోసం ఖర్చు చేశారని ఇది ఎక్కడా లేదన్నారు. వారి అభిమానం వెల కట్టలేదన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ పదవులలో పని చేసేలా అవకాశం ఇచ్చినందుకు వీరికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి.
Also Read : Arvind Kejriwal : మోదీ అడ్డుకున్నా విద్యాభివృద్ది ఆగదు