Vennamaneni : వెన్నమనేని మామూలోడు కాదప్పా
రూ. 2,000 కోట్ల లావాదేవీలు
Vennamaneni : బంగారు తెలంగాణ మాటేమిటో కానీ ఫక్తు స్కామ్ ల తెలంగాణగా మారింది. దేశంలో ఏ వైట్ కాలర్ నేరం చోటు చేసుకున్నా దాని మూలాలు నేరుగా హైదరాబాద్ వైపు చూపిస్తున్నాయి.
ఢిల్లీలో చోటు చేసుకున్న మద్యం పాలసీ స్కాం(Liquor Scam) ఇప్పుడు భాగ్యనగరాన్ని చుట్టుముడుతోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్సీకి దగ్గరి వ్యక్తిగా భావిస్తున్న వెన్నమనేని శ్రీనివాస్ రావు పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది.
దేశమంతటా 40 చోట్ల దాడులు చేసిన ఈడీ ఇప్పటి వరకు విచారించిందే తప్పా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కానీ వెన్నమనేని ఇంట్లో సోదాలు జరిపింది.
ఆ తర్వాత తమ వాహనంలో ఈడీ తీసుకెళ్లి ఆరు గంటలకు పైగా విచారణ చేపట్టింది. కరీంనగర్ కు చెందిన ఈ బిల్డర్ పై దాడులు చేపట్టడం కలకలం రేపింది.
అతడి ఖాతా నుంచి రాబిన్ డిస్టలరీస్ తో పాటు మరో ఏడు సంస్థలకు రూ. 2,000 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆరోపించింది ఈడీ. సీఏ గోరంట్ల బుచ్చిబాబు, ఆర్డీ చీఫ్ రామచంద్రన్ పిళ్లై లను ఈడీ విచారించింది.
అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బంజారా హిల్స్, మాదాపూర్ , ఉప్పల్ లోని శ్రీనివాస్ రావు(Vennamaneni) కంపెనీలు, నివాసాలను ఈడీ జల్లెడ పట్టింది.
బోయిన్ పల్లి అభిషేక్ కు సంబంధించిన ఆరు ప్రాంతాల్లో ఈడీ, సీబీఐలు సోదాలు చేపట్టాయి. ఎనిమిది కంపెనీలకు శ్రీనివాస్ రావు మధ్యవర్తిగా వ్యవహరించారని కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది.
హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం.
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో ట్విస్ట్