Vennela Gaddar : ఎట్టకేలకు వెన్నెల గద్దర్ కు ఛాన్స్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్
Vennela Gaddar : హైదరాబాద్ – ఎట్టకేలకు దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెలకు ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ మొత్తం 119 సీట్లకు గాను 100 సీట్లు ఖరారు చేసింది.
Vennela Gaddar Got MLA Ticket
తొలి విడతలో 55 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా రెండో విడతలో 45 సీట్లను ప్రకటించింది. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చింది. ఏకంగా 21 మందికి సీట్లను ఇచ్చింది. దీనిపై అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది పక్కన పెడితే ఇటీవలే ప్రజా గాయకుడు గద్దర్ గుండె పోటుతో మరణించారు. ఈసందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా నిలిచారు. ఖమ్మం లో జరిగిన సభలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి ముద్దు కూడా పెట్టారు. ఆ తర్వాత గద్దర్ మరణంతో తీవ్ర సంతాపం వ్యక్తమైంది ప్రపంచ వ్యాప్తంగా.
ఇదిలా ఉండగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో గద్దర్ కు మంచి పేరుంది. దీంతో తమకు టికెట్ ఇవ్వాలని బహిరంగంగానే కోరారు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెల(Gaddar). దీంతో పార్టీ తీవ్ర ఒత్తిడికి గురైంది. చివరకు తల వంచింది. తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించింది.
Also Read : Palvai Sravanthi : పాల్వాయి స్రవంతికి బిగ్ షాక్