Vidadala Rajani Chandrababu : ఆ చావులకు చంద్రబాబే కారణం
ప్రచార నిర్వాకం సామాన్యుల మరణం
Vidadala Rajani Chandrababu : మొన్నటికి మొన్న కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుంటూరు సభలో ముగ్గురు చని పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. ఈ ఘటనపై ఏపీ రాష్ట్ర మంత్రి విడదల రజని షాకింగ్ కామెంట్స్ చేశారు. బాబుపై నిప్పులు చెరిగారు.
ఆయనకు వయస్సు పెరిగే కొద్దీ బుద్ది నశిస్తోందన్నారు. ప్రచార యావకు ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ ఆరోపించారు రజని. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆమె తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్వయంగా విడదల రజని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
ఇప్పటి దాకా బాబు చేసింది ప్రచారం తప్ప ఒరిగింది ఏమీ లేదు. కేవలం అమాయకుల ప్రాణాలు కోల్పోవడం తప్ప. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. తాము ఏదో పంచుతున్నామని. ఈ ఫేక్ ప్రచారం కారణంగా జనం తరలివచ్చారు. కేజీ కందిపప్పు, అర కేజీ నూనె ఇచ్చి చేతులు దులిపేసుకున్నారంటూ మండిపడ్డారు విడదల రజని(Vidadala Rajani).
కందుకూరులో చని పోయిన ఎనిమిది మంది, ఇవాళ గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి చావులకు ప్రధాన బాధ్యుడు చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చని పోయిన కుటుంబాలకు ఒక్కొకరికీ రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని సీఎం జగన్ రెడ్డి ఆదేశించారు.
Also Read : సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్