Vidadala Rajini Jagan : జగనన్నకు రాఖీ కట్టిన రజని
రాఖీ కట్టిన ఏపీ మంత్రి
Vidadala Rajini Jagan : రాఖీ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఏపీ రాష్ట్ర మంత్రి విడుదల రజని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాఖీ కట్టారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని సోదరీమణులందరికీ రాఖీ పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం.
Vidadala Rajini Jagan Rakhi Celebrations
ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పడినా అన్నా, చెల్లెళ్ల బంధం ఎప్పటికీ చెరిగి పోనిదని పేర్కొన్నారు మంత్రి విడుదల రజని(Vidadala Rajini). తనకు రాజకీయంగా అద్భుతమైన అవకాశం ఇచ్చారని, తన స్వంత అన్న కంటే జగనన్న ఎక్కువ అని కొనియాడారు.
ఆయన లేక పోతే తాను లేనేనంటూ పేర్కొన్నారు. అన్ని సమయాల్లో తనకు అండగా నిలిచిన గొప్పనైన, అరుదైన నాయకుడు జగన్ రెడ్డి అని ప్రశంసించారు మంత్రి విడుదల రజని. ఇవాళ కోట్లాది మంది అన్నా చెల్లెళ్లకు అండగా నిలిచిన ఘనత ఒక్క సీఎంకే దక్కుతుందన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా ఏపీ సీఎం జగనన్నకు తాను రాఖీ కట్టడం జీవితంలో మరిచి పోలేనని , ఈ సన్నివేశం తనకు జీవిత కాలమంతా గుర్తుండి పోతుందన్నారు విడుదల రజని. జగనన్న పది కాలాల పాటు చల్లంగా, నవ్వుతూ ఉండాలని కోరారు.
మీరంతా చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు జగన్ రెడ్డి. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు..
Also Read : Dasoju Sravan : సాయిచంద్ కుటుంబానికి కోటిన్నర సాయం