Vijay Thalapathy : సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోగా పేరొందారు తళపతి విజయ్(Vijay Thalapathy). ఆయన మేనరిజం డిఫరెంట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ , పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించారు బీస్ట్ మూవీలో.
ఈ చిత్రం విడుదలై వసూళ్లను రాబడుతోంది. కానీ మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. మాస్టర్ తర్వాత తమిళనాడులో రూ. 100 కోట్లు రాబట్టింది. ఇంకా విజయవంతంగా నడుస్తోంది .
సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ బీస్ట్ టీమ్ తో సరదాగా గడిపారు. వారందరికీ ఆయన ప్రేమ పూర్వకంగా డిన్నర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఆయనే వారందరీకీ దగ్గరుండి వడ్డించడం విశేషం. ఈసందర్భంగా దర్శకుడు దిలీప్ కుమార్ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. స్టార్ హీరో అయినా మూలాలు మరిచి పోని అరుదైన నటుడు తళపతి విజయ్ సార్ అంటూ ట్వీట్ చేశాడు.
ఆయన ప్రేమ పూర్వకంగా ఇచ్చిన ఈ డిన్నర తన కెరీర్ లో జ్ఞాపకంగా మిగిలి పోతుందని పేర్కొన్నాడు. ఈ స్పెషల్ డిన్నర్ కు డైరెక్టర్ తో పాటు బీస్ట్ మూవీకి సంగీతం అందించిన అనిరుధ్ రవిచంద్రన్ , నటి పూజా హెగ్డే , జానీ మాస్టర్ తో పాటు ఇతరులు కూడా ఇందులో పాల్గొన్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. వేలాది మంది జయహో తళపతి(Vijay Thalapathy) అంటున్నారు.
ఇదిలా ఉండగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్క్రీన్ ప్లే బాగాలేదంటూ కామెంట్ చేశారు. కానీ బీస్ట్ మెల మెల్లగా దూసుకు పోతోంది.
Also Read : రూ. 833 కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్-2