Samantha Liger : విజ‌య్ లైగ‌ర్ బోల్డ్ పోస్ట‌ర్ సూప‌ర్

న‌టి స‌మంత సంచ‌ల‌న కామెంట్స్

Samantha Liger : పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ గా పేరొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు అన‌న్య పాండే క‌లిసి న‌టించిన లైగ‌ర్ చిత్రం వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్నారు మూవీ మేక‌ర్స్.

ఇదే స‌మ‌యంలో తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. శ‌నివారం ఈ సినిమాకు సంబంధించి న్యూడ్ తో ఉన్న ఫోటోను విడుద‌ల చేశారు.

విచిత్రం ఏమిటంటే ఈ ఫోటో పూర్తిగా న్యూడ్ గా ఉండ‌డంతో వైర‌ల్ గా మారారు. పూర్తిగా న‌గ్నంగా ఉంది. చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా దీనిని విడుద‌ల చేయ‌డంతో హ‌ల్ చ‌ల్ అవుతోంది.

ఇక దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ తో పాటు సినీ రంగానికి చెందిన ప‌లువురు స్పందించారు. విజ‌య్ బెస్ట్ ఫ్రెండ్ గా పేరొందిన న‌టి స‌మంత(Samantha Liger) ఆస‌క్తిక‌రంగా స్పందించింది. ఈ న్యూడ్ ఫోటోపై బోల్డ్ కామెంట్ చేసింది.

ప్ర‌స్తుతం స‌మంత చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌కలం రేపాయి. విజ‌య దేవ‌ర‌కొండకు ఏం చేయాలో ఏం చేయకూడ‌దో బాగా తెలుస‌ని పేర్కొంది. ధైర్యం, కీర్తి అత‌డి సొంత‌మ‌ని మొత్తంగా విజ‌య్ దేవ‌రకొండ పోస్ట‌ర్ సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా వీరిద్ద‌రూ క‌లిసి గ‌తంలో సినిమాలో న‌టించారు. తాజాగా ఓ కొత్త ప్రేమ క‌థ‌తో సినిమాలో న‌టించ‌నున్నారు. స‌మంత‌తో పాటు ప‌లువురు సినీ న‌టులు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసించారు.

ఇదిలా ఉండ‌గా లైగ‌ర్ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ ఏమిటంటే ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన బాక్స‌ర్ మైక్ టైస‌న్ ఇందులో న‌టించ‌నున్నారు.

Also Read : లైగ‌ర్ విజ‌య్ పోస్ట‌ర్ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!