Vijay Sai Reddy : కష్టాల్లో ఉన్నాం ఆదుకోమని కోరాం
ఏపీని ముంచెత్తిన వరదలు
Vijay Sai Reddy : గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు ఏపీ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఇప్పటికీ గోదావరమ్మ ఉగ్ర రూపం దాల్చుతోంది. పలు ప్రాంతాలకు సంబంధాలు తెగి పోయాయి.
తమ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. తమ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రతి రోజు. వరదలు వచ్చిన వెంటనే సీఎం ఏరియల్ సర్వే చేపట్టారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేశారని అన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా ఎప్పటి లాగే భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అఖిలపక్షంతో సమావేశం నిర్వహించింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీటింగ్ అనంతరం వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి , ఎంపీ విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను ఇంత వరకు నెరవేర్చ లేదని పేర్కొన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు విజయ సాయి రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
గత మూడేళ్లలో రాని వరదలు ఇప్పుడు వచ్చాయన్నారు ఎంపీ. వెంటనే ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. వరద ముంపునకు గురైన జిల్లాలను గుర్తించి వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని ఎంపీ కోరారు.
ఏపీ విభజన చట్టం లోని అన్ని అంశాలు నెర వేర్చాలని సూచించారు. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని విజయ సాయి రెడ్డి విన్నవించారు.
Also Read : వరద ప్రాంతాల్లో కేసీఆర్ ఏరియల్ సర్వే