Vijay Sai Reddy : పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911 కోట్లు
విజయ సాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి
Vijay Sai Reddy : ఏపీ సర్కార్ కు కేంద్రం ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy) రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టకు సంబంధించి నిధులు ఎన్ని మంజూరు చేశారంటూ ప్రశ్నించారు. దీనికి కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు కీలక ప్రకటన చేశారు . పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తికి రూ. 12, 911 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే ఏపీ సర్కార్ కు బదిలీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Vijay Sai Reddy Said
రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మిగిలిన పనులు పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు 10 వేల 911.15 కోట్ల రూపాయలు, వరదల కారణంగా దెబ్బ తిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ఈ విషయం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని ఖర్చు విభాగం గత జూన్ నెలలోనే పేర్కొందని తెలిపారు.
అయితే పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను అందించాల్సి ఉందన్నారు. కాగా ఏపీ సర్కార్ సవరించిన ప్రతిపాదనల మేరకు రూ. 17, 144 కోట్లు కావాల్సి ఉంటుందని తెలిపిందని పేర్కొన్నారు. 2022న రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ వ్యయ విభాగం పరిగణలోకి తీసుకున్న పిమ్మటే మొత్తం 12,911 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.
Also Read : Heavy Rains Telangana : తెలంగాణలో రెడ్ అలర్ట్