Vijay Sai Reddy : చిన్నమ్మా మామూలుగా లేదమ్మా
పురంధేశ్వరిపై విజయ సాయిరెడ్డి ఫైర్
Vijay Sai Reddy : వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన అరుదైన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. కారణం ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు భర్త వెంకటేశ్వర్ రావు, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి బలవంతంగా జేపీ నడ్డాతో మాట్లాడుతుండడాన్ని తప్పు పట్టారు.
Vijay Sai Reddy Comments Viral
ఇంతకన్నా ఆధారం ఇంకేం కావాలంటూ ప్రశ్నించారు ఎంపీ విజయ సాయి రెడ్డి. కీలక వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి పురంధేశ్వరిని. సతీ సమేతంగా మరింది చంద్రబాబు నాయుడిని తీసుకు వెళ్లి మీ పార్టీ జాతీయ చీఫ్ నడ్డాను కలిస్తే ఎలా అని ప్రశ్నించారు.
బీజేపీ చీఫ్ నడ్డాకు ఇష్టం లేక పోయినా బలవంతంగా సర్ది చెప్పే ప్రయత్నం ఎంత వరకు సబబు అని అని నిలదీశారు విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). భారతీయ జనతా పార్టీకి అన్నీ తెలుసు అని పేర్కొన్నారు ఎంపీ. మీరంతా బయటకు వేర్వేరుగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసినా చివరకు అంతా ఒక్కటేనని తేలి పోయిందన్నారు. మొత్తంగా దొంగ చేతికి బీజేపీ తాళం ఇచ్చిందని ఎద్దేవా చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
ఇదిలా ఉండగా విజయ సాయి రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా ఆయన చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు.
Also Read : RK Roja Selvamani : విద్యార్థుల పాలిట జగనన్న దేవుడు