Vijay Sai Reddy : అమరావతి – వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన నారా చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం పార్టీ కొవ్వొత్తులు వెలిగించడం, గంట కొట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఎవరైనా సత్యం, ధర్మం కోసం , న్యాయం కోసం కొవ్వొత్తులు వెలిగించడం చూశామని కానీ టీడీపీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.
Vijay Sai Reddy Shocking Comments on TDP
ఆదివారం ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy) ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీరు ఎన్ని దీపాలు వెలిగించినా చివరకు పరాజయం తప్పదని స్పష్టం చేశారు. ఇప్పటికే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం, తన ఆస్తులను పెంచు కోవడం తప్పితే రాష్ట్రానికి, ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపికి ఆశించిన మేర స్పందన రాలేదని పేర్కొన్నారు. బాబు చేసిన పాపాలు, మోసాలు అంతా ఇంతా కాదని ఆరోపించారు. బాబు పాలనలో గోస తప్ప ఇంకేమీ జనాలకు లేదన్నారు. టీడీపీ చీఫ్ అరెస్ట్ తో తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని చీకటిమయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ఎన్ని వ్యూహాలు , కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో వైసీపీదే అధికారం అని జోష్యం చెప్పారు విజయ సాయి రెడ్డి.
Also Read : Sunil Gavaskar : బీసీసీఐ నిర్వాకం గవాస్కర్ ఆగ్రహం
