Vijay Sai Reddy : తోడేళ్ల ముఠాతో సింహం పోటీ
ఎంపీ విజయ సాయి రెడ్డి
Vijay Sai Reddy : ఆంధ్రప్రదేశ్ – ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును నారా లోకేష్ , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
Vijay Sai Reddy Comments Viral
ఆపై తోడేళ్ల గుంపు లాగా తనకు అనిపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ తోడేళ్ల గుంపు ఏమీ చేయలేదన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని ఆరోపణలు చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకునే శక్తి వారికి లేదన్నారు విజయ సాయి రెడ్డి.
శుక్రవారం ఎంపీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2024లో జరిగే ఎన్నికలు టీడీపీ తోడేళ్ల ముఠా వర్సెస్ వైసీపీ మధ్యన జరగనున్నాయని పేర్కొన్నారు ఎంపీ. అధికారం కోసం పాకులుడుతున్న వారే ఇలాంటి చవకబారు విమర్శలు చేస్తారని ఆరోపించారు.
యూటర్న్ రాజకీయాలు చేస్తున్నది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకుంటే కొంత బెటర్ అని పేర్కొన్నారు. వ్యవస్థలను ఇంత కాలం మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు జగన్ రెడ్డిని ఢీకొనే స్థోమత, సత్తా ఉందని తాను అనుకోవడం లేదన్నారు.
జగన్ సింహం లాంటోడని ఆయనను ఢీకొనే సత్తా ఎవరికీ లేదని ప్రకటించారు విజయ సాయి రెడ్డి.
Also Read : Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో ఊరట