Vijay Sai Reddy : తెలుగుదేశం నీచ రాజ‌కీయం

ఎంపీ విజ‌య సాయి రెడ్డి కామెంట్స్

Vijay Sai Reddy : వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో నీచ రాజ‌కీయాలు పాల్ప‌డుతున్నాడ‌ని మండిప‌డ్డారు. గెలుపు ఆశ‌లు స‌న్న‌గిల్లుతుంటే నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోజు రోజుకు టీడీపీ నిస్పృహ‌లోకి జారి పోతోంద‌ని, అందుకే వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

వ్యాపారుల మ‌ధ్య గొడ‌వ‌ను కూడా వైసీపీకి అంట‌గ‌ట్టే స్థాయికి దిగ‌జారిందంటూ నిప్పులు చెరిగారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి(Vijay Sai Reddy). రాష్ట్రంలో ఎవ‌రికి జ్వ‌రం వ‌చ్చినా , క‌ళ్లు తిరిగి కింది ప‌డి పోయినా, వాంతులు చేసుకున్నా, నిస్తేజంతో ప‌డుకున్నా చివ‌ర‌కు ఏం జ‌రిగినా మొత్తం వైఎస్సార్ సీపీ పార్టీకి, ప్ర‌భుత్వానికి, వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి , మంత్రుల‌కు, ఎంపీలకు, ఎమ్మెల్యేల‌కు అంట‌గట్టే ప‌ని పెట్టుకుంద‌న్నారు.

ఇంత‌టి నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎంపీ విజ‌య సాయి రెడ్డి టీడీపీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో ప్ర‌జ‌లు మార్పు వ‌చ్చింద‌ని, వాళ్లు టీడీపీని, జ‌న‌సేన పార్టీని న‌మ్మ‌ర‌ని పేర్కొన్నారు. 175 స్థానాల్లో మొత్తం గెలుస్తామంటూ ధీమా వ్య‌క్తం చేశారు ఎంపీ.

Also Read : Punjab CM : బాధితులకు సీఎం మాన్ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!