Vijay Sethupath : విజయ్ సేతుపతి తమిళ సినీ రంగంలో పేరు మోసిన నటుడు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఆయన పూర్తి పేరు విజయ గురునాథ సేతుపతి కాళీముత్తు.
1978 జనవరి 16న పుట్టారు. మలయాళం, తెలుగు, హిందీ చిత్రాలతో పాటు ఎక్కువగా తమిళ సినిమాలలో నటించారు. భారతీయ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
నిర్మాతలు, అభిమానులు ఆయనను అంతా మక్కల్ సెల్వన్ అని పిలుస్తారు.
అంటే అర్థం ప్రజల నిధి అని. 50కి పైగా సినిమాల్లో నటించాడు. జాతీయ చలన చిత్ర అవార్డుతో పాటు పలు పురస్కారాలకు ఎంపికయ్యాడు.
నటనలో ప్రత్యేకతను కనిపించే ఈ విలక్షణ నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
మెగాస్టార్ తో కలిసి సైరా నరసింహారెడ్డిలో నటించి తెలుగు వారికి దగ్గరయ్యాడు.
ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన్ బ్లాక్ బస్టర్ మూవీలో దుమ్ము రేపాడు.
ఇళయ తలపతి విజయ్ తో కలిసి చేసిన మాస్టర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కరోనాను తట్టుకుని భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది.
మొదట విజయ్ సేతుపతి దుబాయిలో ఎన్ఆర్ఐ వద్ద అకౌంటెంట్ గా పని చేశాడు. 2010లో చిన్న పాత్ర ద్వారా ఎంటర్ అయ్యాడు తమిళ సినీ ఇండస్ట్రీలోకి. ఐదేళ్ల పాటు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు.
2012లో సుందర పాండియన్ లో విలన్ పాత్ర ను పోషించాడు. పిజ్జా, నడువుల కొంజం పక్కత కానోమ్ ,
సూపర్ డీలక్స్ చిత్రాలలో అద్బుత నటనతో ఆకట్టుకున్నాడు. సేతుపతి (Vijay Sethupath)పాకెట్ మనీ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు.
రిటైల్ దుకాణంలో సేల్స్ మ్యాన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో క్యాషియర్ , ఫోన్ బూత్ ఆపరేటర్ గా ఉన్నాడు. డిగ్రీ అయ్యాక హోల్ సేల్ సిమెంట్ సంస్థలో అసిస్టెంట్ గా చేరాడు. 2003లో జెస్సీని పెళ్లి చేసుకున్నాడు.
దుబాయి నుంచి తిరిగి వచ్చాక స్నేహితులతో కలిసి ఇంటీరియర్ డెకరేషణ్ వ్యాపారంలో కొంత కాలం పనిచేశాడు. అతడిని మొదట బాలు మహేంద్ర గుర్తించి ప్రోత్సహించాడు. టీవీ సీరీయల్స్, లఘు చిత్రాలలో నటించాడు.
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి షార్ట్ ఫిలింలలో నటించాడు విజయ్ సేతుపతి.2006లో సెల్వ రాఘవన్ తీసిన మూవీలో ధనుష్ కు స్నేహితుడిగా నటించేందుకు ఎంపికయ్యాడు. ఆనాటి నుంచి నేటి దాకా విజయ్ సేతుపతి (Vijay Sethupath )ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
Also Read : మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీ వాయిదా