PM Modi : ధైర్యానికి ప్ర‌తీక విజ‌య ద‌శ‌మి – మోదీ

దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు

PM Modi : దేశ ప్ర‌జ‌లంద‌రికీ విజ‌య ద‌శ‌మి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోదర దాస్ మోదీ. ధైర్యానికి, సంయ‌మ‌నం వ‌హించేందుకు, సానుకూల శ‌క్తిని క‌ల్పించేందుకు ద‌స‌రా ఫెస్టివ‌ల్ దోహ‌దం చేస్తుంద‌ని పేర్కొన్నారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ , తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ గ్రీటింగ్స్ తెలిపిన వారిలో ఉన్నారు.

డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ , మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్, రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బాఘేల్, క‌ర్ణాట‌క సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై , అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌, ఒడిశా , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.

విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప్ర‌సంగించారు. దేశ పౌరులుకు ధైర్యం , సంయమ‌నం , సానుకూల శ‌క్తి క‌ల‌గాల‌ని ఆకాంక్షించారు. ఇదిలా ఉండ‌గా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కులు లో జ‌రిగే ద‌స‌రా వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇదిలా ఉండ‌గా జ‌మ్మూ కాశ్మీర్ లో ప‌ర్య‌టిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో కొత్త శ‌క్తిని, స్పూర్తిని నింపాల‌ని కోరారు.

Also Read : భార‌త్ తో బంధంపై ఉక్రెయిన్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!