Vijayamma YS Sharmila : ఎన్నికల బరిలో విజయమ్మ..షర్మిల
100 స్థానాలలో వైఎస్సార్ టీపీ పోటీ
Vijayamma YS Sharmila : తెలంగాణ – రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల నగారా మోగింది. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని భావించారు వైఎస్సార్ టీపీ శ్రేణులు. కానీ ఊహించని రీతిలో హస్తం రిక్తహస్తం చూపించింది. వైఎస్ షర్మిల(YS Sharmila) పెట్టిన కండీషన్స్ కుదరక పోవడంతో ఈసారి ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ , కూతురు షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెర దించారు.
Vijayamma YS Sharmila Participation in Telangana Election
తల్లీ బిడ్డలు ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాస్ట్రంలో ప్రస్తుతం 119 సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 సీట్లు ప్రకటించింది. ఇంకా కాంగ్రెస్ , బీజేపీ, బీఎస్పీ పార్టీలు సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఎస్పీలు ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇక ప్రచారంలో అందరికంటే ముందంజలో ఉంది బీఆర్ఎస్.
ఇప్పటికే ఆ పార్టీ బాస్ , సీఎం కేసీఆర్ 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈనెల 15న బీ ఫారమ్ లు కూడా అందజేయనున్నారు. ఇక వైఎస్సార్ టీపీ విషయానికి వస్తే పాలేరు, మిర్యాల గూడ నుండి షర్మిల పోటీకి దిగనుంది. సికింద్రాబాద్ నుంచి బరిలో ఉంటానని ప్రకటించింది వైఎస్ విజయమ్మ.
Also Read : North East Express : పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్