Vijayasai Reddy : సహకార సంఘాల్లో భారీ అవినీతి
ఎంపీ విజయ్ సాయి రెడ్డి కామెంట్స్
Vijayasai Reddy : ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ్యసభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. కోఆపరేటివ్ సొసైటీలలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వాటి గురించి ఎందుకు పట్టించు కోవడం లేదంటూ నిలదీశారు. చాలా సహకార సంఘాలు ఖాయిలా పడుతున్నాయని, వీటిని అరికట్టేందుకు చట్ట పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయ సాయి రెడ్డి. మంగళవారం రాజ్యసభలో సహకార సంఘాల అవినీతిపై , ఖాయిలా పడడంపై కీలక ప్రశ్నలు సంధించారు.
Vijayasai Reddy Asking
మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ మాట్లాడారు. సహకార సంఘాలకు పునరుజ్జీవం కల్పించేందుకు కోఆపరేటివ్ పునరావాస, పునర్నిర్మాన , అభివృద్ది నిధిని ఏర్పాటు చేయాలని ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijayasai Reddy) సూచించారు. లాభాల్లో ఉన్న సహకార సంఘాల లోంచి కొంత మొత్తాన్ని నిధిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ఎంపీ. ఈ నిధి సక్రమంగా ఉండేలా పటిష్టవంతమైన యంత్రాంగానికి రూప కల్పన చేయాలన్నారు. బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు.
మితి మీరిన రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలే సహకార సంఘాల పాలిట శాపంగా మారాయని ఆరోపించారు. మంజూరైన నిధుల గురించి ఇప్పటి వరకు వివరాలు కేంద్రం వద్ద లేవన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడాలని కోరారు. ఎలక్షన్ అథారిటీకి సమర్పించాలని అన్నారు విజయ సాయి రెడ్డి.
Also Read : Minister KTR : రుణ మాఫీపై అసెంబ్లీలో ప్రకటన